హీరోయిన్ ఫార్మాట్ నే మార్చి పారేసిన యాక్ట్రెస్..నాట్య మయూరి సాయి పల్లవి. అద్భుతమైన నటన. అంతకుమించిన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్గా సాయి పల్లవి తన ప్రత్యేకను చాటుకుంటోంది. యాక్టింగ్, డాన్సింగ్ కలగలిసిన నటి ఆమె. డాన్స్‌కి తనదైన క్లాసికల్ టచ్..అసలు ఆ పేరు వింటేనే అదో జోష్. అదొక మాగ్నటిక్ పవర్. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలన్నంత అభిమానం.. ప్రేమ. తన కోసమే ఆడియెన్స్‌ను థియేటర్లను రప్పించుకొనేంత పాపులారిటీ. తాజాగా శ్యామ సింగరాయ్ సినిమాతో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుంది.ఫిదా మూవీలో స్వయంగా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి చెప్పినట్టు నిజంగానే ఆమె సింగిల్ పీస్.
మిగతా హీరోయిన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్. సినిమాల ఎంపికలోనే కాదు ఆకట్టుకునే అందం..అంతకుమించిన అద్భుతమైన నటన వీటన్నింటికీ మించి సూపర్ డాన్స్‌తో అందరిని ఫిదా చేస్తుంది. కేరెక్టర్ ఏదైనా ఆపాత్ర తప్ప, సాయి పల్లవి కనిపించదు ప్రేక్షకులకు. పెర్ఫామెన్స్ ఓరియంట్ పాత్రను ఎంచుకుంటూ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పకుంటూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తనకు నచ్చని కథలను రిజెక్ట్ చేయడమే కాదు కోట్లాది రూపాయలు కుమ్మరించే యాడ్స్ వైపు కన్నెత్తికూడా చూడని మనస్తత్తం ఆమెది. గొప్ప బ్రాండ్స్‌గా భావించే కంపెనీల కమర్షియల్ యాడ్స్‌ను తిరస్కరించి విమర్శలను సైతం ఫిదా చేసింది సాయి పల్లవి.
చిన్నప్పటినుంచీ మంచి డ్యాన్సర్ కావడంతో సాయి పల్లవికి నాట్యం నేర్పించారు ఆమె తల్లిదండ్రులు. అలా మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’లో తనదైన స్టెప్పులతో ప్రేక్షక జనాన్ని తనవైపు తిప్పుకుంది. ఇక తెలుగులో ‘ఫిదా’ మూవీతో భారీ హిట్‌ను సాధిచింది. ఆమె కరియర్లో ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకం. దాదాపు అన్ని సూపర్ డూపర్ హిట్స్. మరికొన్ని బాక్సాఫీసు వద్ద రికార్డులను క్రియేట్ చేశాయి. ఫిదాలోని అన్ని పాటలు హిటే. అలాగే తమిళ స్టార్‌హీరోతో ధనుష్‌తో నటించిన ‘మారి 2’లో రౌడీ బేబీ పాట రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి నటించిన హిట్మూవీ లవ్‌స్టోరీ .
ఈ మూవీలోని సారంగధరియా సృష్టించిన హంగామా గురించ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమేలేదు. కేవలం సాయి పల్లవి డ్యాన్స్కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారంటే అతిశయోక్తికాదు. ఆమె డ్యాన్స్‌కు ఫిదా కాని వారు ఉంటారా అసలు.ఈ నేపథ్యంలోనే సినీ దర్శక నిర్మాతలు కూడా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన సాంగ్ ఉండేలా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా తాజాగా శామ్ సింగరాయ్ ఈ సినిమాలోని ఒక పాట క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. పగలు ప్రాక్టీ్సు, రాత్రి షూటింగ్ ఇలా ఏడు రోజులపాటు చాలా కష్టపడిందట అంతేకాదు పడి పడి లేచే మనసు వసూళ్ల విషయంలో నిరాశపర్చడంతో.. తన రెమ్యూనరేషన్నువెనక్కి ఇచ్చేసిందని ఇండస్ట్రీ టాక్. దటీజ్ సాయి పల్లవి.
తెలుగులో ‘ఎంసీఏ’, ‘పడి పడి లేచే మనసు’ ‘కణం’ సూర్యా 36, మూవీలతో ఆకట్టుకుంది. అలాగే ‘అనుకోని అతిథి’ మూవీలో మానసిక సమస్యతో బాధపడే క్యారెక్టర్లో సాయి పల్లవి యాక్టింగ్ నభూతో నభవిష్యతి. వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్‌తో పోటీపడి మరీ నటించింది. విలక్షణ నటుడు రానాతో విరాటపర్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ పుట్టిన సాయి పల్లవి దక్షిణాదిన వరస విజయాలతో దూసుకుపోతోంది. అలాగే కవల సోదరి పూజా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.