Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాయి పల్లవి ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు విజయ్ తెరకెక్కించిన తెలుగు, తమిళ చిత్రం ‘కణం’ను మరోసారి వాయిదా వేశారు. దాదాపు నాలుగు నెలలుగా ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంను ఈనెల 9న విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ ఆడియన్స్ పరీక్షల కారణంగా మార్చిలో సినిమా చూడరని అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేయానే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సలహా మేరకు ఈ చిత్రాన్ని రెండు వారాల పాటు వాయిదా వేశారు. రంగస్థలం చిత్రానికి ముందు వారం ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. నాగశౌర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. చిత్ర యూనిట్ సభ్యులు సైతం ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ కాకున్నా, ఖచ్చితంగా విమర్శకుల ప్రశంసలు అందుకునేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంతో సాయి పల్లవికి మంచి పేరు వస్తుందని, ఇంత చిన్న వయస్సులో వయస్సుకు మించిన పాత్రలో, అది కూడా ఒక తల్లి పాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదు. సాయి పల్లవి తల్లిగా నటించి మెప్పించడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.