ప్రభాస్ హీరోగా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆదిపురుష్”. ఓంరౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారని సమాచారం. ‘మహానటి’ కీర్తిసురేశ్ సీతగా నటిస్తున్నారన్న వార్తలకు అంతే లేదు. అయితే హీరో ఎక్కడుంటే విలన్ అక్కడుంటాడు. అలాగే ఈ సినిమాలో రాముడు ఉన్నాడంటే రావణుడు కూడా ఉండాల్సిందే కదా! కాబట్టి విలన్ ఎవరనేది చిత్రయూనిట్ గురువారం అధికారికంగా వెల్లడించింది. ప్రభాస్‌తో ఫైట్ చేసేందుకు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించింది. ఈ హీరో ఇదివరకే ఓం రౌత్ దర్శకత్వం వహించిన తానాజీ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు.
కాగా విలన్ పాత్రను లంకేశ్‌గా పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. “ఆదిపురుష్” అని అర్థం వచ్చేలా ఏ అక్షరాన్ని హైలెట్ చేస్తూ మధ్యలో విల్లు పట్టుకుని గురి చూస్తున్న రాముడు, పక్కన హనుమంతుడు, పైన పది తలల రావణుడు ఉన్నారు. “ఏడు వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు..” అని ప్రభాస్ రాసుకొచ్చారు. సైఫ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రభాస్ తెలిపారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సహా పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్ర షూటింగ్ పూర్తైన తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.