రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ కష్టాలు

రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ కష్టాలు

పాక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ సాజిద్‌ ఖాన్‌ మాయాజాలంతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ కష్టాల్లో పడింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 76 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 188/2తో బ్యాటింగ్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 98.3 ఓవర్లలో 4 వికెట్లకు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బాబర్‌ ఆజమ్‌ , రిజ్వాన్‌ , ఆలమ్‌  అర్ధ సెంచరీలతో రాణించారు.