సలార్ ట్రైలర్ రిలీజ్..!

సలార్ ట్రైలర్ రిలీజ్..!
Cinema News

పాన్ ఇండియా సినిమా లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ , పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఈ కొత్త రిలీజ్ ట్రైలర్‌ని డిసెంబర్ 18న ఉదయం తీసుకొస్తామని ప్రకటించిన సినిమా యూనిట్.. కాస్త ఆలస్యం తర్వాత మధ్యాహ్నం విడుదల చేసింది.

 

సలార్ ట్రైలర్ రిలీజ్..!
Salaar Trailer

సలార్కిసినిమా కి పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ మూవీపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సలార్ సునామీ సృష్టిస్తుందనేలా ట్రెండ్ కనిపిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సలార్ సినిమా కి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 22న ‘సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్’ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఒక ట్రైలర్ రాగా.. అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు దద్దరిల్లిపోయే యాక్షన్‍తో తాజాగా మరో రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.

ట్రైలర్ కోసం ఈ వీడియో ని క్లిక్ చేయండి