పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా సలార్. ఈ సినిమా పార్ట్ -1 సలార్– సీజ్ ఫైర్ గా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా బృందం ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ ర్యాంపేజ్ ఇంకా యూట్యూబ్ లో కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఇవాళ ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ తో ముందుకు వచ్చింది.
సలార్ నుంచి ఇవాళ చిత్రబృందం పస్ట్ సింగిల్ ని విడుదల చేసింది. సూరీడే గొడుగు పట్టి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది ఈ పాట ప్రభాస్, పృథ్వీరాజ్ ల స్నేహం గురించి తెలియజెప్పే పాట అని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ స్నేహితులుగా కనిపించబోతున్నారని ఈ పాట చూస్తే అర్థమవుతోంది. మనసును హత్తుకుంటున్న ఈ పాటను కృష్ణకాంత్ రచించారు. ఖడ్గమొకడైతే.. కలహాలు ఒకడివిలే.. ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే.. సైగ ఒకడు సైన్యమొకడు కలసి కదిలితే కదనమే.. ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే.. నూరేళ్లు నిలవాలే అంటూ రాసిన ఈ లిరిక్స్ ఎంతో హృద్యంగా సాగాయి. ఈ పాటకు కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా హరిణి పాడారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ వినేయండి.
మీరు కూడా ఈ పాట ని ఒక లుక్ వేసుకోండి ..