ఒంటిపై నాగ చైతన్య టాటూను తొలగించిన సామ్ !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువ అవుతుంది. ఏ మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సమంత… ఇప్పటికీ అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూనె ఉంది . ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి మూవీ లో హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది సమంత. ఖుషి మూవీ విజయ్ దేవరకొండ మరియు సమంతకు మంచి హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

ఒంటిపై నాగ చైతన్య టాటూను తొలగించిన సామ్ !
Samantha

అయితే 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది సమంత. దాదాపు నాలుగు సంవత్సరాలు వీరిద్దరూ వివాహ బంధాన్ని కొనసాగించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల 2021 డిసెంబర్ మాసంలో విడాకులు కూడా తీసుకున్నారు. ఇక 2021 నుంచి ఇప్పటివరకు సమంత మరియు నాగచైతన్య విడివిడిగానే ఉంటున్నారు.

ఇక తాజాగా నాగచైతన్య జ్ఞాపకాలను పూర్తిగా తొలగించింది సమంత. హీరోయిన్ సమంత ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోల ను షేర్ చేశారు. అయితే అందులో ఆమె తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య పేరుతో ఉన్న టాటూను తొలగించినట్లు కనిపిస్తుంది . మరి నిజంగా ఆమె టాటూ తొలగించారా ? లేక మేకప్ వేసి కవర్ చేశారా ? అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలోనే నాగచైతన్య మరియు సమంత మళ్ళీ ఒకటి కాబోతున్నారని మొన్నటి వరకు ప్రచారం జరిగిన సంగతి అందరికి తెలిసిందే.