సమంత నాగ చైతన్య విడాకులు నిజమేనా ?

సమంత నాగ చైతన్య విడాకులు నిజమేనా ?

సమంత, నాగ చైతన్య విడాకుల రూమర్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మామూలుగా అయితే ఇలాంటి రూమర్లు, వార్తలపై సమంత సెటైర్లు వేస్తుంటుంది. కానీ ఈ మధ్య మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. అలా అని సోషల్ మీడియాలో యాక్టివ్ లేదని కాదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ చిల్ అవుతోంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకుంటోంది. వెరైటీ సూక్తులను షేర్ చేస్తోంది. వేధాంత ధోరణిలో పాఠాలను వల్లిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విడాకుల వ్యవహారం మీద వస్తోన్న రూమర్లకు సమంత రియాక్షన్‌లకు లింక్ ఉన్నట్టు కనిపిస్తోంది.

మామూలుగా సమంత తన ఇన్ స్టా స్టోరీలో నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ప్రేమ, పెళ్లి, బంధాలు, విలువలు, తప్పొప్పులు ఇలా కొన్నింటి గురించి ప్రత్యేకమైన అర్థం వచ్చేలా పోస్ట్‌లు పెడుతోంది. నువ్ నన్ను హర్ట్ చేసి ఉండొచ్చు.. నేను నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు.. మనం ఇద్దరం ఒకరినొకరు హర్ట్ చేసుకుని ఉండొచ్చు.. ఏదైనా సరే రియాల్టీ ఇదే.. శిశిరాన్ని అనుభవిస్తేనే వసంతం దొరుకుతుంది అంటూ పరోక్షంగా ఏదో అర్థం వచ్చేలా సినిమా కొటేషన్లను షేర్ చేసింది.

ఎదుటి వాళ్లు మనకు చేసిందే.. తిరిగి మనం కూడా వాళ్లకు చేస్తే.. ప్రశ్నించే హక్కును కోల్పోతాం అంటూ ఇలా రకరకాల పోస్ట్‌లు కొటేషన్లను చేస్తూ వస్తోంది. ఇక తాజాగా సమంత బుద్దుని మాటలను షేర్ చేసింది. ఎప్పటికీ దాచలేనివి మూడున్నాయి.. అందులో సూర్యుడు, చంద్రుడు, నిజం ఉంటాయి అని చెప్పుకొచ్చింది. అంటే ఈ విడాకుల వ్యవహారం వెనుక ఉన్న నిజం త్వరలోనే బయటకు వస్తుందనే ఉద్దేశ్యంలో సమంత పోస్ట్ చేసిందా? లేదా? నాగ చైతన్య వల్లే ఇలా జరుగుతోందని నిందలు వేసేందుకు ఇలా చేస్తోందా? అనేది తెలియడం లేదు.

అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోందో ఓ పట్టాన ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కేవరకు వ్యవహారం వెళ్లిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరి ఈ రూమర్లు ఇంకెన్నాళ్లు ఇలా వ్యాప్తి చెందుతుంటాయో చూడాలి. సమంత, చైతూలు నోరు విప్పి ఎప్పుడు మాట్లాడాతారో చూడాలి.