హీరోయిన్ సమంత ఇప్పటి వరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఇప్పటి వరకు హీరోయిన్‌గా, లీడ్ యాక్టర్‌గా మాత్రమే నటించారు. కానీ, ఇప్పుడు తొలిసారి నెగిటివ్ రోల్‌లో నటించబోతున్నారు. అది కూడా ఒక వెబ్ సిరీస్‌లో. సమంత వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారనే విషయం ఇప్పటికే బయటికి వచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో సమంత కీలక పాత్రలో నటించనున్నట్లు స్పష్టమైంది. ఈ సిరీస్‌లో సమంత టెర్రరిస్టుగా కనిపించనున్నట్లు సమాచారం.
మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైంది. మొత్తం 10 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాపులర్ హిందీ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌ను తీస్తున్నారు. అదే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. దీనిలో సమంత పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఆమె పోషించేది టెర్రరిస్ట్ పాత్ర కావడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది. మొదటి సిరీస్‌కు మించి ఈ రెండో సిరీస్ పాపులర్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
