నేను సావిత్రిలా అయిపోయేదాన్ని….సమంత షాకింగ్ కామెంట్స్…సమంత జీవితంలో ‘జెమినీ గణేశన్ ఎవరు ?

Samantha akkineni discloses Gemini Ganesan in her life

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి జీవితం గురించి తెలియని ఈ తరం వారికి, ప్రేక్షకులకు ‘మహానటి’ సినిమా ద్వారా ఆమె జీవితంలో ఏం జరిగిందనే విషయం క్లుప్తంగా స్పష్టమైంది. స్టార్ హీరోలతో సమానంగా వేతనాన్ని అందుకున్న సావిత్రి తాగుడుకు బానిస అవ్వడానికి, పతాక స్థాయి నుండి అధమ స్థాయికి పడిపోవడానికి గల కారణం తాను నమ్మిన ప్రేమేనని, జెమినీ గణేశన్ పై పెంచుకున్న ఆప్యాయతేనని ‘మహానటి’ సినిమా చెప్పకనే చెప్పింది. అయితే ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించిన సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అదేంటంటే తాను అంతకు ముందే ప్రేమలో పడిందట. అదీ కూడా అలా ఇలా కాదు… కొంచెం తేడా వచ్చినా.. సావిత్రిలా తన జీవితం మారిపోయి ఉండేదని ఇప్పుడు రియలైజ్ అయ్యేంతగా. సావిత్రి జీవితం నుంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు..

సమంత మొత్తం ఓపెన్ అయిపోయారు. కొద్దిలో ఉంటే తానూ వ్యక్తిగత జీవితంలో సావిత్రినయిపోయేదాన్నని భయపడ్డారు. అసలు కథ విన్నప్పుడు తన కథలానే అనిపించిందట. అదృష్టం కొద్ది బయటపడ్డానన్నారు. ఆ బాధ నుండి తాను త్వరగానే కోలుకున్నానని, తన అదృష్టంగా చైతూ తనకు దొరికాడని తన అనుభూతులను ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇంతకీ సమంత జీవితంలో వచ్చిన ‘జెమినీ గణేశన్’ ఎవరు? అనే విషయాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ఎందుకంటే ఆ విషయాలు అప్పట్లోనే ప్రముఖ వార్తలుగా హల్ చల్ చేశాయి. ఏది ఏమైనా గతాన్ని మరిచిపోయి ప్రస్తుతం అక్కినేని వారింటి కోడలుగా సమంత జీవితం హాయిగా సాఫీగా సాగిపోతోంది. ఈ సమయంలో పాత విషయాలని గుర్తు చేసుకోవడం తప్పే అయినా అంతటి నరకం నుండి బయట పడటం సొంతోషించే విషయమేగా మరి.