బాబు దెబ్బకి దిగొచ్చిన మోడీ…జీవీల్ ఉక్రోషం పట్టలేడు పాపం.

GVL Narasimhan Has Done The Target of Chandrababu In Press Meet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఓ 4 నాలుగు నెలల కిందట ప్రధాని మోడీ గురించి ఏ రాజకీయ నాయకుడు అయినా వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే వణికిపోయేవాడు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు NDA కి గుడ్ బై కొట్టి కేంద్రం మీద విమర్శలు చేసాడో అప్పుడే ఇక ఈయన పని ఖాళీ అనుకున్న వాళ్ళు చాలా మంది వున్నారు.అందుకు కారణం ప్రధాని మోడీ వ్యవహారశైలి. నిన్నగాక మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ మీద , తన మీద విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి ఇక్కడ వున్నది మోడీ అని వ్యాఖ్యానించి బహిరంగ హెచ్చరికలు చేశారు. ఇదే విషయం మీద మాజీ ప్రధాని మన్మోహన్ రాష్ట్రపతి కి ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. అలాంటి మోడీ ఇప్పుడు బాబు దెబ్బకు దిగొచ్చాడు. ఒకటి రెండు కాదు పది మెట్లు కిందకి దిగారు. అయితే ఆ విషయం బయటకు వచ్చినా పరువు పోకుండా చూసుకునేందుకు జీవీఎల్ , కన్నా లాంటి వాళ్ళని బాబు మీదకు ఉసి గొలిపారు. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలని ఉందా ?
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా జిల్లాకి 50 కోట్లు చొప్పున ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఆ కోటాలో ఏపీ లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కలిపి మూడేళ్ళ పాటు కేంద్రం 350 కోట్లు ఇచ్చింది. అయితే ఇతర విభజన హామీల అమలు కోసం చంద్రబాబు ఎప్పుడైతే గళం ఎత్తాడో మోడీ ఇగో హర్ట్ అయ్యింది. ఇదేదో ఆయన సొంత ఇంటి వ్యవహారంలా తీసుకున్న మోడీ ఈ ఏడాది కేంద్రం నుంచి విడుదల చేసిన 350 కోట్లని తిరిగి RBI ద్వారా వెనక్కి తెప్పించుకున్నారు. NDA నుంచి బయటికి వచ్చాక ఢిల్లీ సహా వివిధ చోట్ల ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్స్ లో చంద్రబాబు ఈ అంశాన్ని అకౌంట్ డీటెయిల్స్ తో సహా చూపించేసరికి జాతీయ మీడియా సైతం బిత్తర పోయింది. మోడీ ఈ స్థాయిలో పగ సాధిస్తారని అర్ధం అయిపోయింది. కర్ణాటకలో తెలుగోడి దెబ్బ , ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత చూసాక RSS నుంచి వచ్చిన చీవాట్లు , హెచ్చరికలతో ఆ 350 కోట్లు తిరిగి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది. ఈ విషయాన్ని ఘనంగా గా ప్రకటించడానికి అన్నట్టు ఏపీ బీజేపీ నేతలు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో యూపీ నుంచి ఎంపీ అయి వచ్చిన జీవీఎల్ నరసింహారావు నిధుల అక్రమ వినియోగం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేందుకు నానా పాట్లు పడ్డారు. మోడీ సర్కార్ చేసిన ప్రతీకార రాజకీయాలను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఇంకో అడుగు ముందుకేసి ఇది ఎవడబ్బ సొమ్ము అని చంద్రబాబుని టార్గెట్ చేసాడు జీవీఎల్. ఆయన అన్నది నిజమే అనుకున్నా కేంద్రం ఇచ్చేది కూడా ఎవడి అబ్బ సొమ్మో కాదని , ప్రజల సొమ్మే అని గుర్తు ఉంచుకుంటే మంచిది.