పెళ్లిపీట‌ల‌పై సమంత క‌న్నీరు…

Samantha cry while naga chaitanya tie the knot

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

న‌వ్వినా, ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి అన్నాడు ఓ క‌వి. నిజంగానే బాధగా ఉన్న సంద‌ర్భంలోనే కాదు… అత్యంత ఆనందం అనుభ‌వించే క్ష‌ణంలోనూ భావోద్వేగంతో క‌న్నీరు వ‌స్తుంది. ఇక పెళ్లి లాంటి అపురూప‌మైన ఘ‌డియ‌ల్లో అదీ… కోరుకున్న‌వాడితో మ‌నువు జ‌రిగే శుభ‌ముహూర్తాన… ఆనందం అంబ‌రాన్నంటే సంద‌ర్భంలో కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి. స్టార్ హీరోయిన్ స‌మంత త‌న పెళ్లివేడుక‌లో ఇలాగే భావోద్వేగానికి లోనై క‌న్నీరు పెట్టుకుంది.

ఈ అరుదైన ఫీలింగ్ ను ఫొటో గ్రాఫ‌ర్ కెమెరాలో బంధించారు. స‌మంత ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటో గురించి ఏం చెప్పాలో తెలియ‌డం లేద‌ని, అలెన్జ్ ఈ అశాశ్వ‌త‌మైన భావోద్వేగాన్ని చిత్రీక‌రించార‌ని స‌మంత తెలిపింది. ఫోజు ఇచ్చి దిగే ఫొటోల క‌న్నా… రియ‌ల్ మూమెంట్స్ లో తీసే ఫొటోలు ఎప్పుడూ అపురూపంగా ఉంటాయ‌ని ఆనందం వ్య‌క్తంచేసింది. పెళ్లికూతురు స‌మంత భావోద్వేగానికి గురైన‌ప్పుడు… చాలా చాలా సంతోషం మ‌ధ్యలో ఆనంద భాష్పాలు అని ఆమె పోస్ట్ చేసింది.