స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న సామ్ త్వరలోనే ముంబైకి మకాం మారనుందట. ఇప్పటికే సౌత్‌లో సూపర్‌స్టార్‌గా ఫేమ్ తెచ్చుకున్న సమంత త్వరలోనే బాలీవుడ్‌లోనూ పాగా వేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ కారణగానే హిందీలో ఎక్కువగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యిందట. దీంతో హిందీ సినిమాల కోసం తరచూ హైదరాబాద్ నుంచి ప్రయాణాలు చేసే పనిలేకుండా అక్కడే ఓ ఇల్లు తీసుకోవడం బెటర్ అని సామ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ముంబై సముద్ర తీరాన సామ్ ఒక అందమైన ఇంటిని సమంత కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.
నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లాట్ ని దాదాపు రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఫ్లాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసి పూర్తిగా ముంబైకి షిఫ్ట్ కానుందట సామ్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఇక ప్రస్తుం సమంత తెలుగులో యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది.