స‌మంత పెళ్లి డ్రెస్ ఇదే…

Samantha Ruth Prabhu Instagram Post Her Marriage Dress

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్టోబ‌రు ఆరున నాగ‌చైత‌న్య‌, స‌మంత వివాహం జ‌ర‌గ‌నుంది. పెళ్లికి ఇంకొన్ని రోజులే గ‌డువుండ‌డంతో ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. ఎంగేజ్ మెంట్ రోజు డిజైన‌ర్ క్రేషా బ‌జాజ్ డిజైన్ చేసిన చీర‌ను క‌ట్టుకున్న స‌మంత … పెళ్లిలో ఎలాంటి డ్రెస్ వేసుకుంటుందా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

స‌మంత ఎంగేజ్ మెంట్ చీర నెట్ లో విప‌రీతంగా షేర్ అయింది. ఆ చీర‌పై స‌మంత, నాగ‌చైత‌న్య జీవితంలోని కొన్ని ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌ను, వారు క‌లిసి న‌టించిన సినిమాలోని కొన్ని సీన్ల‌ను డిజైన్ చేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది డిజైనర్ క్రేషా బ‌జాజ్. ఇప్పుడు పెళ్లిలో స‌మంత వేసుకునే డ్రెస్ నూ క్రేషా బ‌జాజే రూపొందించింది.

 

లెహంగా మాదిరిగా ఉన్న ఈ డ్రెస్ ను స‌మంత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. బ‌హుశా ఇదే తాను పెళ్లిలో ధ‌రించ‌బోయే లెహంగా అవుతుందేమో అని కామెంట్ చేసింది స‌మంత‌. ఈ సంద‌ర్భంగా క్రేషా బ‌జాన్ ను పొగడ్త‌ల్లో ముంచెత్తింది స‌మంత‌. క్రేషా బ‌జాజ్ రూపొందించే డిజైన్లు ఫ్యాష‌న్ రంగంలో కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రేమించి పెళ్లిచేసుకున్న క్రేషా బ‌జాజ్…త‌న పెళ్లిలో వేసుకున్న లెహంగాను ఆమే స్వ‌యంగా డిజైన్ చేసుకుంది. త‌న ప్రేమ‌లోని కొన్ని మధుర‌మైన ఘ‌ట‌న‌ల‌ను ఆమె త‌న లెహంగాపై డిజైన్ చేసుకోవ‌డంతో అప్ప‌ట్లో ఆ డ్రెస్ సంచ‌ల‌నంగా మారింది. త‌న పెళ్లి డ్రెస్ తో ఒక్క‌సారిగా పాపుల‌రైన క్రేషా బ‌జాజ్ ఎంద‌రో సినీ సెల‌బ్రిటీలకు న్యూ ట్రెండ్స్ ప‌రిచ‌యం చేస్తోంది. ఆ క్ర‌మంలోనే స‌మంత త‌న ఎంగేజ్ మెంట్ చీర‌ను క్రేషా బ‌జాజ్ తో డిజైన్ చేయించుకుంది. ఇప్పుడు పెళ్లి లోనూ క్రేషా బ‌జాజ్ రూపొందించిన లెహంగాను ధ‌రించ‌నుంది.