టాలీవుడ్‌ హిరోయిన్‌ సమంత నిరాశ

టాలీవుడ్‌ హిరోయిన్‌ సమంత నిరాశ

2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్‌బెర్రీ ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సొంత ఓఎస్‌ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్లాక్‌ బెర్రీ ఫోన్‌ పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఈ మేరకు ఇక తమ ఫోన్ల శకం ముగింసిందని ప్రకటించడంతో చాలా మంది వినయోగదారులు నిరాశకు గురయ్యారు. ఇదే తరహాలో టాలీవుడ్‌ హిరోయిన్‌ సమంత కూడా ఈ విధంగా ప్రకటించడం తనను కూడా చాలా బాధించింది అని చెబుతోంది.

ఈ బ్లాకెబెర్రీ ఫోన్‌లు 2000 సంవత్సరం ప్రారంభంలో చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వినియోగించేవారు. పైగా వాటిని “క్రాక్‌బెర్రీస్” అని పిలిచేవారు. అంతేకాదు కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్‌లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్‌.. కీ సెటప్‌తో ప్రత్యేకంగా ఆకర్షించేవి. అలాంటి ఫోన్‌లు శకం ముగియడంతో సమంత ఈ బ్లాక్‌బెర్రీఫోన్‌లకు చాలా బాధగా వీడ్కోలు పలుకుతున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పైగా ఈ విషయం నన్ను ఎందుకింత బాధించిందో తనకు తెలియదు అని ఇన్‌స్టాలో పేర్కొంది.