‘ఏ మాయ చేశావే సినిమా’తో వెండితెరపై మెరిసి కుర్రకారును మాయ చేసింది సమంత. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషలలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక సమంతతో సినిమా అంటే లాభాలే అనేంతగా నిర్మాతలకు, హీరోలకు లక్కి ఛామ్‌గా మారింది సామ్. 2017లో హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన సామ్ వివాహాం అనంతరం అదే జోష్‌ను కొనసాగించింది. అదే జోరుతో సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకుంటున్న సామ్ ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫాం ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటుకుంది.
ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు. ఇటూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లుపైనే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుటికైనా కాస్తా విరామం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ సమయాన్ని పూర్తిగా వ్యక్తిగత జీవితానికి, ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నా.
అందుకే కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి హ్యాపీగా ఇంట్లోనే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాను. అందుకే శాకుంతలం తర్వాత కొత్త ప్రాజెక్ట్స్‌కు సంతకం చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే సమంత ఈ సడెన్ నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఆమె కేవలం బ్రేక్ కదా తీసుకుంటుంది, పూర్తి గుడ్‌బై చెప్పడంలేదు కదా మరికోందర కాస్తా ఊరట పడుతుంటే, కెరీర్ పీక్స్‌లో ఉండగానే సామ్ ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైన సామ్ ఇప్పుడు తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించాలనుకుంటుందంటే త్వరలోనే చై-సామ్ గుడ్‌న్యూస్ చెప్పాలనుకుంటున్నారా? ఏంటీ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.