సమంత మరో సంచలన నిర్ణయం

సమంత మరో సంచలన నిర్ణయం

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా స్పెషల్‌సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని పుష్ప టీం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒకే పాటలో బన్నీతో కలిసి మాస్‌ స్టెప్పులేయనుంది సమంత. పెళ్లి తర్వాత నుంచి కేవలం పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు సైన్‌ చేస్తున్న సమంత తాజాగా స్పెషల్‌ సాంగ్‌కు ఓకే చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది.

దీనికి గల కారణాలు ఏమై ఉంటాయా అని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సాధారణంగానే సుకుమార్‌ సినిమా అంటేనే స్పెషల్‌ సాంగ్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. ఆర్య సినిమాలోని అ అంటే అమలాపురం’నుంచి ‘రంగస్థలం’లో జిగేల్‌ రాణి వరకూ ప్రతి ఐటెమ్‌ సాంగ్‌ సూపర్‌ హిట్టే. దీనితో పాటు రంగస్థలం సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన సుకుమార్‌ అడగడంతో సమంత కాదనలేకపోయిందనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

ఏది ఏమైనా ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన పుష్ప చిత్రంలో ఈ స్పెషల్‌సాంగ్‌ మరింత హైలెట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్‌ భావిస్తుంది. అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో ఫుల్‌ బిజీగా ఉన్న సమంత త్వరలోనే బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లో సైతం సందడి చేయనున్నట్లు సమాచారం.