విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా దూసుకుపోతోంది. వరస ప్రాజెక్ట్స్‌కు సంతకాలు చేస్తూ సరికొత్తగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లి తర్వాత డిసెంట్ రోల్స్ సెలక్ట్ చేసుకున్న సామ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ప్రస్తుతం ‘కాతువాకుల రెండు కాదల్’ తమిళ చిత్రంలో పాటు ఓ థ్రీల్లర్ సినిమాకు సంతకం చేసింది.
అలాగే మరో తమిళ చిత్రానికి కూడా ఆమె ఒకే చెప్పింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు సామ్ ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌కు సంతకం చేసినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ మూవీలో ప్రధాన పాత్రలో నటించేందుకు సమంత సంతకం చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
‘అరెంజ్మంట్స్ ఆఫ్ లవ్ మూవీ’ని సమంత గతంలో నటించిన ‘హో! బేబీ’ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్నట్లు ఇటివల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇండియన్ ప్రొడక్షన్ హౌజ్ గురు ఫిల్మ్స్ సమర్పణలో సునీత తాటి నిర్మించనున్నారట. ఇండియన్ రైటర్ టైమెరి ఎన్. మురారి రాసిన నవల ఆధారంగా బ్రిటిష్-శ్రీలంక నటి నిమ్మి హర్‌స్గామా ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ పేరుతో పబ్లిష్ చేసింది. ఇది 2004లో విడుదలై అత్యధిక అమ్ముడైన నవలగా పేరొందింది. అంతేగాక టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరమ్‌కు ఎంపికైన ఏకైక ఆసియా ప్రాజెక్ట్ ఇది.