శబ్దం లేని సమంత వెబ్ సిరీస్.!

శబ్దం లేని సమంత వెబ్ సిరీస్.!
Cinema News

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించిన లాస్ట్ సినిమా “ఖుషి” తో తన కెరీర్ లో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత సమంత ఒక ఏడాది గ్యాప్ తీసుకుంటున్నట్టుగా తెలియచేసింది . అయితే ఆమె ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఈ ట్రీట్మెంట్ కన్నా ముందు సమంత అప్పుడు ఖుషి తో పాటుగా ఒక భారీ వెబ్ సిరీస్ ని కూడా చేసింది.

శబ్దం లేని సమంత వెబ్ సిరీస్.!
Samantha

అదే ప్రైమ్ వీడియోలో చేసిన “సిటాడెల్”. అయితే ఈ సిరీస్ ని సమంత అప్పుడే కంప్లీట్ చేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ సిరీస్ విషయంలో అసలు చప్పుడు లేదు. దీనితో ఈ సిరీస్ నిలిచిపోయిందా లేక ఇంకా సమయం తీసుకుంటున్నారా లేక దీని ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్ లో అంత గొప్ప రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఏమన్నా ఆపేసారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.