అదేంటి సమంతా ఎన్నికల్లో గెలవడం ఏమిటీ అనుకుంటున్నారా ? ఎప్పుడూ సినిమాలంటూ బిజీగా వుండే నటి సమంత గత ఎన్నికల సమయంలో ఆమె సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచారు. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్నా ఆమె ప్రచారం చేసిన సైకిల్ పార్టీ అభ్యర్ధి గెలిచారు. గత ఎన్నికల సమయంలో టీడీపీకి ఓటేయాలని సమంత ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ప్రచారం నేరుగా నియోజకవర్గానికి వెళ్లి చేయకుండా సోషల్ మీడియా వేదికగా చేసింది. దీంతో ఆమె సపోర్ట్ చేసిన అభ్యర్థి 13వేల మెజార్టీతో ఘన విజయాన్ని అందుకున్నారు.
దీంతో సమంత సపోర్ట్ వల్లే ఆయన గెలిచారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ సమంత ప్రచారం చేసింది ఎవరికంటే రేపల్లె నుంచి టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన అనగాని సత్య ప్రసాద్‌కు ప్రచారం చేసింది. ఆయన్ను గెలిపించమని కోరుతూ సైకిల్ గుర్తుకే మీ ఓటని వీడియో పోస్ట్ చేసింది. సత్య ప్రసాద్‌కు మద్దతుగా నిలవడానికి గల కారణాన్ని కూడా సమంత చెప్పింది. సత్యప్రసాద్ చాలా మంచివాడని ఆయన సోదరి తన స్నేహితురాలని తెలిపింది. దీంతో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోయినా సమంత సపోర్ట్ చేసిన వ్యక్తి గెలవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.