చిన్న వ‌య‌స్సులోనే క‌న్నుమూసిన స‌మ్మోహ‌నం న‌టుడు

sammohanam actor died

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం స‌మ్మోహ‌నం. సుధీర్ బాబు. అదితిరావు హైద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. అయితే ఇందులో అదితి రావు మాజీ ప్రియుడిగా న‌టించిన అమిత్ పురోహిత్‌ రీసెంట్‌గా క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అమిత్ పురోహిత్‌ ఆక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డం షాక్‌కి గురి చేసింది. స‌మీరా( అదితి) మాజీ ప్రియుడిగా న‌టించిన అమిత్ చాలా స్నేహాశీలి. ప్ర‌తి సీన్‌కి వంద శాతం న్యాయం చేస్తాడు. మ‌రో యంగ్ యాక్ట‌ర్‌, మంచి న‌టుడు ఈ లోకాన్ని తొంద‌ర‌గా వీడారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధిస్తున్నాను. స‌మ్మోహ‌నం డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి త‌న ట్విట్ట‌ర్‌లో.. అమిత్ మృతి చెందాడ‌నే విష‌యం నాకు షాక్ క‌లిగించింది. అమిత్ పురోహిత్ మంచి వ్య‌క్తిత్వం ఉన్న న‌టుడు. నిన్ను ఎప్ప‌టికి మిస్ అవుతూనే ఉంటాం. నీ ఆత్మకి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధిస్తున్నాను అని పేర్కొన్నారు. స‌మ్మోహ‌నం చిత్రంలో అమిత్ మ‌ల్హోత్రా పాత్ర‌లో కనిపించిన అమిత్ పురోహిత్ ఎలా మ‌ర‌ణించాడ‌నే దానికి సంబంధించి వివ‌రాలు తెలియాల్సి ఉంది.