బిగ్ బాస్ 3పై స్టార్ మా అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

big boss 3 official advertisement

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం నార్త్‌లో సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. సౌత్‌లోను ఈ కార్య‌క్ర‌మం వ‌రుస సీజ‌న్‌లు జ‌రుపుకుంటుండ‌గా, తెలుగులో సీజ‌న్ 3 జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో 16 మంది కంటెస్టెంట్‌లు ఉంటార‌ని తెలుస్తుంది. వారెవ‌ర‌నేది అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయిన వారికి సంబంధించిన లిస్ట్ మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇక ఈ కార్య‌క్ర‌మం ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఈ వార్త ఆనందాన్ని ఇస్తుంద‌నే చెప్పాలి. తాజాగా స్టార్ మా ఓ ప్రోమో ద్వారా బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మం సీజ‌న్ 3 జూలై 21 నుండి టెలికాస్ట్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 24 గంట‌లు, 64 కెమెరాల మ‌ధ్య 16 మంది కంటెస్టెంట్స్ చేసే హంగామాతో ఇక బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఫ‌న్ దొరుకుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బిగ్ బాస్ హౌస్‌లో యాక్టింగ్ కాదు.. ఓన్లీ రియాలిటీనే ఉంటుంద‌ని నాగ్ ప్రోమోలో తెలిపాడు. బిగ్ బాస్ సీజ‌న్ 2లో నాని .. హౌజ్‌మేట్స్ చేసే హంగామాని నా..నీ టీవీలో చూపించ‌గా ఈ సారి నాగ్.. పండూతో అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటాడ‌ని ప్రోమో ద్వారా తెలుస్తుంది.