టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత-నాగ చైతన్య విడిపోయి సుమారు 6నెలలు కావోస్తుంది. ఇప్పటికీ ఈ జంట విడాకుల విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. మరోవైపు వీరిద్దరూ మళ్లీ కలిస్తే బావుంటుందని ఇప్పటికీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మరోవైపు నాగ చైతన్యతో విడిపోయినా మిగతా కుటుంబసభ్యులతో మాత్రం ఇప్పటికీ సన్నిహితంగానే ఉంటుందీ సామ్.
తాజాగా అఖిల్ అక్కినేని గురించి సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. నిన్న అఖిల్ బర్త్‌డే సందర్భంగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడ్ని కోరుకుంటున్నా’ అంటూ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే సమంత పోస్ట్‌పై అఖిల్ స్పందించలేదు.