బ్రిస్బేన్‌ ఓపెన్‌ టోర్నీలో ఆడనున్న సానియా

బ్రిస్బేన్‌ ఓపెన్‌ టోర్నీలో ఆడనున్న సానియా

మహిళల డబుల్స్ లో నెం1 ర్యాంకు పొందిన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి  సానియామీర్జా. నెం1 క్రీడాకారిణిగా 2003నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదటి నుండే విజయవంతమైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలుస్తూ భరి పారితోషికం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణిగా కూడా పేరు సంపాదించింది.

బ్రిస్బేన్‌ ఓపెన్‌ టోర్నీతో వచ్చే ఏడాది జనవరిలో సానియా మీర్జా అంతర్జాతీయ సర్క్యూట్‌లో మళ్ళీ ఆడనుంది. సానియా రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంటూ ఇటీవల మళ్లీ రాకెట్‌ పట్టి వారంలో ఆరు రోజుల పాటు ప్రాక్టీస్‌ చేస్తోంది. మహిళల డబుల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌గా నిలిచి మహిళల, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో కలిపి ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గింనది.

తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో కూడా బరిలోకి దిగనున్న సానియా ప్రస్తుతం నాలుగైదు గంటలు రోజులో ప్రాక్టీస్‌ చేస్తు పునరాగమనం చేయనుంది. ఈ విషయం పైన సానియా  మాట్లాడుతూ ఒత్తిడి లేకుండా ఆడి తన  టెన్నిస్‌ కెరీర్‌లో అనుకున్న విజయాలన్నీ సాధించాను ఇపుడు రానున్న ఆటలలో సాదించే విజయాలన్నీ బోనస్‌లాంటివే అని తెలిపింది.