ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా –లూసీ హర్డెస్కా జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 7–6 , 4–3తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్, టాప్ సీడ్ జోడీ సినియకోవా–క్రిచికోవా పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్‌ను సొంతం చేసుకొని రెండో సెట్లో సానియా–హర్డెస్కా 4–3తో ఆధిక్యంలో ఉన్న దశలో సినియకోవా–క్రిచికోవా గాయంతో వైదొలిగారు.