భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈస్ట్‌బార్న్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్‌లో నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది.
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సానియా–మ్యాటెక్ సాండ్స్ జోడీ 3–6, 4–6తో అమెరికా ద్వయం సబ్రినా శాంటామరియా–క్రిస్టీనా మెక్‌హాలె చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.