శ‌ర‌భ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

sharabha movie review

నటీ నటులు : ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి, డా. జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్,
సంగీతం : కోటి
సినిమాటోగ్రఫీ : సాయిమాధవ్ బుర్రా
నిర్మాత : అశ్విన్ కుమార్ సహదేవ్
దర్శకత్వం : నరసింహ రావు

దాదాపు రెండేళ్ల‌కుపైగా నిర్మాణం జ‌రుపుకున్న చిత్రం శ‌ర‌భ . భారీ గ్రాఫిక్స్ హంగుల‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామ‌ని ప్ర‌చారం చేయ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఆసక్తిని రేకెత్తించింది. టాప్ క్లాస్ త‌మిళ‌ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, తెలుగులో ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి వంటి ప‌లువురు ద‌ర్శ‌కుల వ‌ద్ద ఇర‌వై ఏళ్ల‌ పాటు స‌హాయ‌కుడిగా ప‌నిచేసిన ఎన్‌.న‌ర‌సింహారావు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆకాష్‌కుమార్ ఈ సినిమాతో క‌థానాయ‌కుడిగా అరంగేట్రం చేశారు. మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయిక‌గా న‌టించింది. దాదాపు న‌ల‌భై కోట్ల వ్య‌యంతో నిర్మాత అశ్వినీకుమార్ స‌హ‌దేవ్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం…

కధ :

సింగ‌పురం గ్రామానికి చెందిన పార్వ‌త‌మ్మ (జ‌య‌ప్ర‌ద‌) పూల వ్యాపారం చేస్తుంటుంది. కొడుకు శ‌ర‌భ(ఆకాష్‌కుమార్‌) అంటే ఆమెకు పంచ‌ప్రాణాలు. మావ‌య్య చిన్నారావు(నాజ‌ర్‌)తో క‌లిసి శ‌ర‌భ జులాయిగా తిరుగుతుంటాడు. మినిస్ట‌ర్ (షాయాజీ షిండే) కూతురు దివ్య‌(మిస్టీ చ‌క్ర‌వ‌ర్తి) కొన్ని పీడ క‌ల‌ల‌తో బాధ‌ప‌డుతుంటుంది. అది చూడ‌లేక ఆమెను శివ‌గిరికి తీసుకొస్తాడు. క్షుద్ర‌శ‌క్తుల కార‌ణంగా ఆప‌ద‌లో ఉన్న మినిస్ట‌ర్ కూతురు దివ్య‌ను కాపాడే బాధ్య‌త శ‌ర‌భ చేప‌డుతాడు. ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ప‌రిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమ‌గా మారుతుంది. రాక్తాక్ష(చ‌ర‌ణ్‌రాజ్‌) అనే తాంత్రికుడు దివ్య‌తో పాటు శ‌ర‌భ కుటుంబాన్ని అంతం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు.

సిరిగిరి ప్రాంతంలోని అడవుల్లో చండ భైర‌విని ఉపాసించే మాంత్రికుడు చంద్రాక్షుడు(పునీత్‌). అత‌ని కుమారుడు ర‌క్తాక్షుడు(చ‌ర‌ణ్ దీప్‌). వీళ్ల‌కి గురువు(ర‌ఘుబాబు) స‌ల‌హాల‌తో 17 సంవ‌త్స‌రాల పాటు కుద్ర పూజ‌లు చేస్తూ 17 మంది విశిష్ట క‌న్య‌ల‌ను బ‌లిస్తాడు. 18 ఏడు జ‌రిగే బ‌లితో స‌మ‌స్త విశ్వానికి నాయ‌కుడు కావాల‌నుకుంటాడు చంద్రాక్షుడు. ప‌ద్దెనిమిది శ‌క్తి పీఠాల చేత బందీ కాబ‌డిన కోట్లాది పిశాచ‌గ‌ణాల‌ను విడిపించి ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లోకి తెచ్చుకోవాల‌ని ర‌క్తాక్ష తండ్రి చంద్ర‌క్షా ప్ర‌య‌త్నిస్తాడు. ఒకానొక సమయంలో శ‌ర‌భ తండ్రి కార్త‌వరాయుడు(నెపోలియ‌న్‌)చంద్రాక్ష‌ను చంపుతాడు. ఈ ప్ర‌మాదంలో కార్త‌వరాయుడు చ‌నిపోతాడు. తండ్రి ల‌క్ష్యాన్ని అత‌డి కొడుకైనా ర‌క్తాక్ష చేప‌డుతాడు. విశిష్ట‌జాత‌కంలో జ‌న్మించిన దివ్య‌ను బలి ఇచ్చి తండ్రిని తిరిగి ప్రాణంపోయాల‌నుకున్న రాక్త‌క్ష ప్ర‌య‌త్నాన్ని దైవ‌శ‌క్తి స‌హాయంతో శ‌ర‌భ ఎలా అడ్డుకున్నాడు. ఈ ప్ర‌య‌త్నంలో అత‌డికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? అన్న‌దే ఈ చిత్ర క‌థ‌.

విశ్లేషణ :

దైవ శ‌క్తికి దుష్ట‌శ‌క్తికి మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే ఈ సినిమా లైన్. రొటీన్‌ క‌మ‌ర్షియ‌ల్ క‌థాంశానికి గ్రాఫిక్స్ హంగుల‌ను మేళ‌వించి ద‌ర్శ‌కుడు న‌ర‌సింహారావు ఈ క‌థ రాసుకున్నారు. ఈ సినిమా క‌థేమిట‌న్న‌ది తొలి స‌న్నివేశంతోనే అర్థం అవుతుంది. ప్ర‌పంచానికి అధిప‌తి కావ‌డానికి ప్ర‌త్యేక జాత‌కంలో జ‌న్మించిన అమ్మాయిని బ‌లి ఇస్తే స‌రిపోతుంద‌ని ప్ర‌తినాయ‌కుడు చెప్పే స‌న్నివేశాల‌తోనే క‌థ‌పై ప్రేక్ష‌కుడికి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. సినిమా మొద‌లైన‌ రెండు నిమిషాల్లో ముగింపు ఏమిటో ద‌ర్శ‌కుడు చెప్పేశాడు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు సరికదా క‌థ‌నాన్ని న‌డిపించే తీరులో వైవిధ్య‌త కోసం ప్ర‌య‌త్నించ‌లేదు దర్శకుడు. ఇక హీరో ప‌రిచ‌య ఘ‌ట్టాల‌న్నీ ప‌దేళ్ల క్రితం నాటి సినిమాల్ని త‌ల‌పిస్తాయి. త‌ల్లీకొడుకు అనుబంధంతో ముడిప‌డిన క‌థ ఇది. కానీ జ‌య‌ప్ర‌ద‌, ఆకాష్‌కుమార్ అనుబంధాన్ని హృద‌యానికి హ‌త్తుకునేలా ఆవిష్క‌రించేలా బ‌ల‌మైన స‌న్నివేశాల్ని ఎక్కడా చూపలేకపోయారు. ఆకాష్‌కుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లన్నీ అవ‌న్నీ సినిమా నిడివిని పెంచి చిరాకు తెప్పిస్తాయి. రొటీన్‌గా సాగుతున్న క‌థ‌ను ఫ్లాష్‌బ్యాక్‌పేరుతో మ‌లుపుతిప్పే ప్ర‌య‌త్నం చేశారు. సినిమాలోని స‌న్నివేశాల్లో లాజిక్ క‌నిపించ‌దు.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ఆకాశ్‌కుమార్ స‌హ‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టించాడు. అయితే తొలి చిత్రం కావ‌డంతో ఆకాష్‌కు ఆ అనుభ‌వ లేమి అడ‌గ‌డుగునా క‌నిపిస్తుంది. ఇక మిస్టి చ‌క్ర‌వ‌ర్తి న‌ట‌న కూడా అంతంత మాత్ర‌మే. ఇక జ‌య‌ప్ర‌ద‌, నెపోలియ‌న్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, నాజ‌ర్‌, పొన్ వ‌న‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు న‌ర‌సింహారావు తొలి చిత్రంలో గ్రాఫిక్స్‌, దైవ‌శ‌క్తి, దుష్ట‌శ‌క్తి మ‌ధ్య జ‌రిగే పోటీ అంటూ కాస్త రిస్కీ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. క‌థ ప‌రంగా కొత్త‌ద‌నం లేక‌పోయినా క‌థ‌నం బాగానే ఉంది. ఇక కోటి అందించిన పాట‌లు గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది. రాక రాక వచ్చిన సినిమాని చెడకొట్టాడనే చెప్పాలి. కానీ నేప‌థ్య సంగీతం బాగుంది. ర‌మ‌ణ సాల్వ కెమెరావ‌ర్క్ బావుంది. గ్రాఫిక్స్ వర్క్ చాలా బావుంది. సినిమాకి ఇంకొంచెం కత్తెరకి వదిలేస్తే మంచిది అనిపిందింది.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : శరభ…దుష్ట‌శ‌క్తికీ, దైవ‌శ‌క్తికీ మ‌ధ్య గ్రాఫిక్స్ దట్టించిన పోరాటం.
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.25/5