నేడు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 144వ జయంతి

నేడు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 144వ జయంతి

ఉక్కు మనిషిగా పేరుగాంచిన స్వతంత్ర భారతదేశ తొలి ఉప ప్రధాని, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ 144వ జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు .గుజరాత్‌లోని నర్మదా నది తీరాన గల పటేల్‌ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని ఆయన స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, హోంమంత్రి అమిత్‌ షా నివాళి అర్పించారు. గుజరాత్‌లోని పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి ‘రన్ ఫర్ యూనిటీ’ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఇందుకోసం బుధవారం రాత్రి 9.30గంటలకు ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. ఐక్యతా దినోత్సవం సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 6.30గంటలకు గాంధీనగర్‌లోని రాజ్‌భవన్ నుంచి ఆయన కెవాడియా వెళ్తారు. అక్కడ నర్మదా ఒడ్డున ఉన్న సర్దార్ విగ్రహాన్ని సందర్శిస్తారు. అనంతరం ఏక్తా దివస్ పరేడ్(రన్ ఫర్ యూనిటీ)లో పాల్గొంటారు. వేలాది మంది ఇందులో పాలుపంచుకోనున్నారు.అనంతరం సివిల్ సర్వీస్ ఆఫీసర్లతో భేటీ అవుతారు. ఆ తర్వాత 10గంటలకు పోలీస్ ఆధునీకీకరణపై ఉన్నతాధికారులతో జరిగే చర్చల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30గంటల నుంచి 2.30గంటల వరకు ఇతర అధికారులతో భేటీ అవుతారు. 3.30గంటల నుంచి 4.30గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వడోదరా నుంచి సాయంత్రం 5గంటలకు తిరిగి ఢిల్లీ పయనమవుతారు.