నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ “సరిపోదా శనివారం” కోసం అందరికీ తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్ నుంచి వచ్చిన “అంటే సుందరానికీ” లాంటి మూవీ తర్వాత వస్తున్న పక్కా మాస్ మూవీ ఇది కావడంతో ఆ మూవీ కి మిస్ అయ్యిన మాస్ బజ్ అంతా ఈ మూవీ పైనే ఇపుడు కనిపిస్తుంది.
ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా మంచి బజ్ ను రైజ్ చేయగా ఇప్పుడు ఈ మూవీ నుంచి రానున్న ట్రైలర్ కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు ఈ ట్రైలర్ ను రిలీస్ చేస్తుండగా అందరి కళ్ళు ఈ ట్రైలర్ మీదనే పడ్డాయి. ప్రస్తుతానికి అయితే సరిపోదా శనివారం ట్రైలర్ పై సాలిడ్ హైప్ ఫ్యాన్స్ జెనరల్ ఆడియెన్స్ లో కూడా ఉంది. మరి ఈ ట్రైలర్ అంచనాలు అందుకుంటుంది అనే చాలా మంది అనుకుంటున్నారు. మరి చూడాలి ఈ మూవీ ఆ అంచనాలు అందుకుంటుందో లేదో అనేది.