Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచిన ఆ చిత్రం హిందీలో డబ్ అయ్యింది. సహజంగా తెలుగులో విడుదలైన పెద్ద సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ అవుతాయి. కాని ఈ చిత్రం మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. బుల్లి తెరపై భారీ టీఆర్పీ రేటింగ్ సాధించడంతో పాటు, యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను దక్కించుకుని ఇండియాస్ నెం.1 గా నిలిచింది. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సరైనోడు హిందీ డబ్బింగ్ రైట్స్‌ను తీసుకు వారికి కాసుల పంట పండిచ్చింది.
ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా యూట్యూబ్‌లో 145 మిలియన్ వ్యూస్ సాధించింది లేదు. బాలీవుడ్ సినిమాలకు సైతం సాధ్యం కాని ఈ రికార్డును ఒక సౌత్ సినిమా, అది కూడా డబ్బింగ్ వర్షన్‌తో సాధించడం అంటే మామూలు విషయం కాదు. గతంలో కూడా అల్లు అర్జున్ చిత్రాలకు భారీ క్రేజ్ యూట్యూబ్‌లో దక్కింది. యూట్యూబ్‌లో అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయ్యాడు అంటూ బాలీవుడ్ వర్గాల వారు కూడా ఒప్పుకుంటున్నారు. ఒక తెలుగు సినిమా ట్రైలర్ పది మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తేనే గొప్పగా చెబుతారు. అలాంటిది ఏకంగా 145 మిలియన్ల వ్యూస్ అంటే అల్లు అర్జున్ యూట్యూబ్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఆలిండియా రికార్డు సాధించిన అల్లు అర్జున్‌కు మా తరపున కూడా శుభాకాంక్షలు.