ఐక్యంగా అన్నాడీఎంకే …చిన్నమ్మ వర్గం బలి.

sashi-kala-rebels-anna-dmk-leaders-united-together

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అన్నాడీఎంకే ఇక చీలికలు,పీలికలకి చెక్ పడబోతోంది. రెండు ప్రధాన వర్గాలు ఒక్కటి కాబోతున్నాయి. సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఏకతాటి పైకి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఈ కలయిక జరగడానికి చిన్నమ్మ శశికళ వర్గం బలైపోయింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకి కలిసిపోవాలని ఎప్పటినుంచో ఉన్నప్పటికీ చిన్నమ్మ శశికళ, ఆమె చుట్టం, పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ అడ్డంకిగా నిలిచారు. వారిని పార్టీ నుంచి వెలివేస్తే తప్ప అన్నాడీఎంకే లో ఐక్యత సాధ్యం కాదని పన్నీర్ సెల్వం ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ విషయంలో ఇన్నాళ్లు మౌనం వహించిన పళనిస్వామి వర్గం పన్నీర్ డిమాండ్ తీర్చడానికి ఒప్పుకుంది. పళనిస్వామి వర్గం నేతలు ఈ రోజు సమావేశమై దినకరన్ ని పార్టీ పదవి నుంచి తప్పిస్తూ తీర్మానం చేశారు. ఓ విధంగా చెప్పాలంటే శశికళని ధిక్కరిస్తూ బయటపడ్డారు.

మరికొద్ది రోజుల్లోనే పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాలు కలిసిపోడానికి ఈ చర్య ఓ పునాది కాబోతోంది. ఇప్పటికే లోపాయికారీగా జరిగిన చర్చల్లో పన్నీర్ సెల్వం కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఆర్ధిక, ప్రజా పనుల శాఖ ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారట. ఒకవేళ పన్నీర్ ఇందుకు ఒప్పుకోకపోతే కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారన్నమాట. అంటే అన్నాడీఎంకేలో రెండు వర్గాలు కలవడంతో పాటు ఆ పార్టీ కేంద్ర మంత్రి వర్గంలో చేరడం కూడా ఖరారు అయినట్టే వుంది.

మరిన్ని వార్తలు: 

నేతల పుత్రరత్నాలు మారరా..?

రెవిన్యూలోటూ పూడ్చేది లేదు