అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. తనను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుని 2021 జనవరి చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత సహాయకురాలు శశికళ నటరాజన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు చిన్నమ్మగా సుపరిచితరాలు.
మంచి ప్రవర్తనను చూపుతూ ఆమె బెంగళూరు జైలు నుంచి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, కోర్టు పిటిషన్ను తిరస్కరించటంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందస్తు విడుదలకు కోర్టు అంగీకరిస్తుందనే ఆశతో.. రూ.10 కోట్ల జరిమానాను చిన్నమ్మ వర్గీయులు కోర్టుకు డిపాజిట్ చేసినట్లు సమాచారం.