ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “సత్యం సుందరం” మూవీ …!

"Satyam Sundaram" movie which is streaming on OTT...!
"Satyam Sundaram" movie which is streaming on OTT...!

రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన పలు క్లీన్ ఎంటర్టైనింగ్ మూవీ లో కోలీవుడ్ నుంచి వచ్చిన మూవీ “సత్యం సుందరం” కూడా ఒకటి. కార్తీ అలాగే అరవింద స్వామి కాంబినేషన్ లో 96 మూవీ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ ఇపుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.

"Satyam Sundaram" movie which is streaming on OTT...!
“Satyam Sundaram” movie which is streaming on OTT…!

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఇందులో పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు తప్పకుండా చూడొచ్చు. మరి ఈ మూవీ ని సూర్య, జ్యోతికలు నిర్మాణం వహించగా తెలుగులో ఆసియన్ సురేష్ వారు విడుదల చేసారు.