మే 9న విడుద‌ల‌కు ముస్తాబవుతున్న మ‌హాన‌టి

Savitri Biopic Mahanati to release on May 9

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న మ‌హాన‌టి విడుద‌ల తేదీ ఖ‌రార‌యింది. మే 9న ఈ సినిమా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. ఉగాది శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ విడుద‌లైన ఈ పోస్ట‌ర్ పై కీర్తిసురేశ్ సైడ్ నుంచి మేక‌ప్ వేసుకుంటూ క‌నిపిస్తోంది. మే 9న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న మ‌హాన‌టి అని రాసిఉంది. ఈ పోస్ట‌ర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. వైజ‌యంతిమూవీస్, స్వ‌ప్న‌సినిమా సంయుక్తంగా నిర్మిస్తున‌న మ‌హాన‌టిని సెంటిమెంట్ ప్ర‌కారమే మే 9న విడుద‌ల చేస్తున్న‌ట్టు స‌మాచారం. వైజ‌యంతీమూవీస్ బ్యాన‌ర్ లో 1990ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట‌యిన చిరంజీవి- శ్రీదేవి సినిమా జ‌గదేక‌వీరుడు-అతిలోకసుంద‌రి కూడా అప్ప‌ట్లో మే 9నే రిలీజ‌యింది.

ఆ సినిమాలాగే మ‌హాన‌టి కూడా సంచ‌ల‌న విజ‌యం న‌మోదుచేస్తుంద‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌హాన‌టిలో ఇంకొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలిఉంది. నిజానికి ఈ సినిమాను మార్చి 30న విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావించింది కానీ…షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో వాయిదాప‌డింది. కీర్తిసురేశ్ తో పాటు స‌మంత‌, దుష్క‌ర్ స‌ల్మాన్, విజయ్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్ బాబు, ప్ర‌కాశ్ రాజ్, షాలినీ పాండే, మాళ‌వికానాయ‌ర్, భానుప్రియ‌, దివ్య‌వాణి, అవ‌స‌రాల శ్రీనివాస్, ద‌ర్శ‌కులు క్రిష్, త‌రుణ్ భాస్క‌ర్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో ఆయ‌న మ‌న‌వ‌డు నాగ‌చైత‌న్య న‌టిస్తున్నాడు.