రూ.4వేల కోట్ల స్కామ్ కేసు.. ఓ ఐఏఎస్ ఆత్మ‌హ‌త్య‌

సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య

బెంగుళూరులో ఘోరం చోటు చేసుకుంది. సంచ‌ల‌నం సృష్టించిన ఐఎంఏ కుంభ‌కోణంలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. బెంగ‌ళూరులోని ఆయ‌న నివాసంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్పడ్డారు.

అయితే విజ‌య్ శంక‌ర్ రూ.1.5 కోట్ల లంచం తీసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదే సమయంలో జరిపిన  విచారణలో కూడా ఆయ‌న పేరు తెర‌పైకి వ‌చ్చింది. గతంలో బెంగుళూరు సిటీ కలెక్టర్ గా పని చేసిన విజయ్ శంకర్… మంగ‌ళ‌వారం సాయంత్రం తిలక్ నగర్ పోలీసులు స్టేష‌న్ ప‌రిధిలోని త‌న నివాసంలో ప్రాణాలు విడిచారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు విజ‌య‌శంక‌ర్ బార్య‌, కూతురు ఇంట్లోనే ఉన్నారు.. సాయంత్రం వ‌ర‌కు ఇంట్లోవారితో గ‌డిపిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత ఫ‌స్ట్‌ఫ్లోర్‌లో ఉన్న త‌న మీటింగ్ రూమ్‌కి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్పడ్డాడు.

అదే విధంగా విజయ్ శంకర్ ఆత్మ‌హ‌త్య‌కు ప్రధాన కారణం… ఐఐఎం కేసులో ఆయన లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావ‌డ‌మేన‌ని తెలుస్తోంది. అయితే కర్ణాటకలో 2019లో ఐఎంఏ స్కాంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకుని అతనికి క్లీన్ చీట్ ఇచ్చారనేది విజయ్ శంకర్ పై సీబీఐ చేసిన ప్రధాన అభియోగం. ఈ కేసులో విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో విజయ్ శంకర్ ఆత్మహత్య చేసుకోవ‌డం చ‌ర్చ‌కు దారితీస్తుంది. కాగా భారీ వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపి రూ.4 వేల కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించింది ఐఎంఏ జ్యూవెలర్స్. సుమారు 50 వేల మంది పెట్టుబ‌డులు పెట్టారు. ఇప్పుడు బోర్డు తిప్పేయ‌డంతో బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఈ కేసు వెలుగు చూడటం జరిగింది.