ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ అనేది పురుషుల విభావంలో ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ కు సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ పోటీలను సూచిస్తుంది. ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ క్రీడా పాలక సంస్థ అంతర్జాతీయ క్రికెట్ సంగం నిర్వహిస్తుంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే చివరి టోర్నమెంట్‌కు ప్రాథమిక అర్హత పోటీలు నిర్వహిస్తారు.ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మరియు అత్యధిక మంది వీక్షించే క్రీడా కార్యక్రమంగా టోర్నమెంట్క గుర్తింపు సాదించింది.
2020లో టి20 ప్రపంచకప్ ఆ్రస్టేలియాలో జరిగనున్న నేపథ్యం లో కొత్తగా స్కాట్లాండ్, ఒమన్ క్రికెట్ జట్లు అర్హత పొందాయి. క్వాలిఫయింగ్ టోర్నీప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ పై 90పరుగుల ఆధిక్యం తో గెలిచింది. అదే విదంగా 12పరుగుల ఆధిక్యంతో ఒమన్ హాంకాంగ్‌పై గెలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 18.3 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి గెలవలేక పోయింది. ఒమన్ జట్టు తొలుత హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 7 వికెట్లకు 134 పరుగులు చేయగా హాంకాంగ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి పరాజయం పాలైంది.