పుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 8,250 కోట్ల సమీకరణకు అనుమతించమంటూ ఏప్రిల్‌లోనే జొమాటో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.
ఐపీవోలో భాగంగా రూ.7,500 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ఇన్ఫో ఎడ్జ్ ఇండియా మరో రూ.750 కోట్ల విలువైన్ షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను కంపేనీల కొనుగోళ్లు, విస్తరణ, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో జోమటో పేర్కొంది.
కొత్త కాలంగా ఆన్లైన్ పుడ్ డెలివరీ సంస్థలు భారీ స్థాయిలో పురోగమిస్తున్న విషయం విదితమే. వెరసి 2019-20లో జొమాటో ఆదాయం రెట్టింపునకు ఎగసి 89.4 కోట్ల డాలర్లు(రూ. 2900కోట్టు)ను తాకింది. అయితే రూ. 2,200 కోట్ల నిర్వహణ(ఇబిటా) నష్టాలు నమోదయ్యాయి. కాగా ఈ ఫిబ్రవరిలో టైగర్ గ్లోబల్స్ కోరా తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి 25 కోట్ల డాలర్లు(రూ.1800 కోట్లు) సమీకరించింది. దీంతో జొమాటో విలువ 5.4 బిలియన్ డాలర్లకు చేరింది.