కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అది కూడా మంచి సెకండ్ హ్యాండ్ కారు అయితే మంచిదని యోచిస్తున్నారా? అయితే మీకోసం సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఓలా కార్స్ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు అందించింది. పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. తగ్గింపుతోపాటు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఆఫర్ చేస్తోంది.
ఓలా కార్స్ ద్వారా మీరు సెకండ్ హ్యాండ్ కారు కొంటే రూ.లక్ష వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. హ్యుందాయ్ క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ మోడల్‌పై ఈ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారును రూ.12.15 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఈఎంఐ రూ.21,639 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది 2017 మోడల్. డీజిల్ వేరియంట్. మారుతీ సుజుకీ బ్రెటా జెడ్ఎక్స్ఐ ప్లస్ కారుపై రూ.75 వేల తగ్గింపు ఉంది. ఇది 2020 మోడల్. దీన్ని రూ.9.69 లక్షలకు కొనొచ్చు. ఈఎంఐ రూ.17,200 నుంచి ప్రారంభం అవుతోంది.
అలాగే రెనో క్విడ్ ఆర్ఎక్స్ఎల్ కారుపై రూ.25 వేల తగ్గింపు ఉంది. దీన్ని 2.82 లక్షలకు కొనొచ్చు. ఇది 2015 మోడల్. ఈఎంఐ రూ.5 వేల నుంచి ప్రారంభం అవుతోంది. హోండా సిటీ ఈ కారుపై రూ.50 వేల తగ్గింపు ఉంది. ఇది 2014 మోడల్. దీన్ని రూ.5.4 లక్షలకు కొనొచ్చు. ఈఎంఐ రూ.9,600 నుంచి స్టార్ట్ అవుతోంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో కంఫర్ట్‌లైన్ 2014 మోడల్‌పై రూ.25 వేల డిస్కౌంట్ ఉంది. దీన్ని రూ.5.21 లక్షలకు కొనొచ్చు. ఈఎంఐ రూ.9,200 నుంచి ప్రారంభం అవుతోంది.
రూ.4,100 ఈఎంఐతో మారుతీ సుజుకీ అల్టో 800 ఎల్ఎక్స్ఐ కారును సొంతం చేసుకోవచ్చు. దీన్ని రూ.2.35 లక్షలకు కొనొచ్చు. 2013 మోడల్. రూ.25 వేల తగ్గింపు లభిస్తోంది. 2016 మారుతీ స్విఫ్ట్ కారుపై రూ.50 వేల తగ్గింపు ఉంది. దీన్ని రూ.6.5 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ రూ. 11 వేల నుంచి ప్రారంభం అవుతోంది. ఫోరర్డ్ ఎకోస్పోర్ట్ యాంటియెంట్ టీఐ వీసీటీ మోడల్‌పై రూ.లక్ష తగ్గింపు ఉంది. దీన్ని రూ. 4.6 లక్షలకు కొనొచ్చు. ఈఎంఐ రూ.8 వేల నుంచి స్టార్ట్ అవుతోంది. 2015 మోడల్.
మారుతీ సియాజ్ సిగ్మా కారుపై రూ.50 వేల తగ్గింపు పొందొచ్చు. దీని ధర రూ.6.4 లక్షలు. 2018 మోడల్. ఈఎంఐ రూ.11,400 నుంచి ప్రారంభం అవుతోంది. హోండా వెర్నా ఎస్ఎక్స్ కారుపై రూ.లక్ష తగ్గింపు ఉంది. ఇది 2016 మోడల్. ధర రూ.6.7 లక్షలు. ఈఎంఐ రూ. 11,900 నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే హోండా అమేజ్ ఎస్ కారుపై రూ. 75 వేల తగ్గింపు పొందొచ్చు. దీని ధర రూ. 4.64 లక్షలు. 2014 మోడల్. ఈఎంఐ రూ.8,200 నుంచి ఉంది. హ్యుందాయ్ శాంట్రో స్పోర్ట్ మోడల్‌పై రూ.75 వేలు ఆదా చేసుకోవచ్చు. దీని ధర రూ. 5.13 లక్షలు. ఈఎంఐ రూ. 9,100 నుంచి స్టార్ట్ అవుతోంది. 2019 మోడల్.
ఫోర్డ్ ఫ్రీస్టైల్ టైటానియమ్ కారుపై రూ. లక్ష తగ్గింపు ఉంది. దీని ధర రూ.5.5 లక్షలు. ఈఎంఐ దాదాపు రూ. 10 వేలు. 2018 మోడల్. ఇలా పలు రకాల కార్లపై ఆఫర్లు ఉన్నాయి. మీకు నచ్చిన దాన్ని కొనుగోలు చేయొచ్చు. అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అందువల్ల మీరు వీలైనంత త్వరగా కారును బుక్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే వేరే వాళ్లు ఈ కార్లను బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇంటి వద్దనే ఫ్రీ టెస్డ్ డ్రైవ్ చేయొచ్చు.