‘గుంటూరు కారం’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

‘గుంటూరు కారం’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా ఈ సినిమాలోని ‘ఓ మై బేబీ’ పాట ప్రోమో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానున్నది . థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని 2వ సింగిల్ పూర్తి పాట డిసెంబర్ 13న విడుదల కి సిద్ధమైంది . మొత్తానికి సూపర్ స్టార్ అభిమానులందరికీ ఇది ఖచ్చితంగా సంతోషకరమైన వార్త. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జ‌న‌వ‌రి 12, 2024న రిలీజ్ కానున్నది.

‘గుంటూరు కారం’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
Guntur Karam

గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది . ముఖ్యంగా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాదంట . హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తుంది . ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అనేది చూడాలి.