అఫ్గానిస్తాన్‌లోని సాల్మా డ్యామ్ సమీపంలో తాలిబన్ల దాడుల్లో 16 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. పశ్చిమ ఆఫ్ఘన్‌లోని చిస్తి జిల్లాలోని హెరాత్ ప్రావిన్స్‌ను తాలిబన్లు తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఇక్కడి చెక్‌పాయింట్ సహా ఆ ప్రదేశాలను తమ వశం చేసుకున్న తాలిబన్లు భద్రతా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 16 మంది సిబ్బంది మృతి చెందగా, మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతకాలంగా సాల్మా డ్యామ్ వద్ద భారత ప్రభుత్వం ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కలిసి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అతి పెద్ద ప్రాజెక్టును చేపడుతుంది.