‘‘సమాజంలో మహిళలపై జరిగే దాడులు విని, చదివి బాధపడతాను. మనం ఏం చేయలేమా? అనుకుంటాను. ‘లవ్ స్టోరీ’లో మౌనిక పాత్ర చేస్తున్నప్పుడు కనీసం నా సినిమా ద్వారా అయినా నా వాయిస్ చెప్పగలిగాను అనే సంతృప్తి కలిగింది’’ అని సాయిపల్లవి అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’.
కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.ఈ సందర్భంగా సాయిపల్లవి చెప్పిన విశేషాలు.డ్యాన్స్ చేయాలంటేనే నాకు భయం వేస్తుంటుంది. ‘రౌడీ బేబీ..’ పాట కష్టంగా అనిపించింది. ‘ఎమ్సీఏ’ చిత్రంలో ‘ఏవండోయ్ నానిగారు..’ పాటకు బాగా కష్టపడ్డా. వెనక్కి వంగి డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. వెన్నెముక దెబ్బతిందేమో? అనుకునేదాన్ని.