మహేశ్‌బాబుకు తల్లిగా హీరోయిన్‌

మహేశ్‌బాబుకు తల్లిగా హీరోయిన్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రాధ కీలక పాత్రలో కనిపించనుందట.

మహేశ్‌ తల్లి పాత్ర కోసం మేకర్స్‌ ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు టాక్‌ వినిపిస్తుంది. కాగా 90వ దశకంలో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన రాధ పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. తాజాగా ఈ చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్‌ సినిమాలో సినియర్‌ హీరోయిన్లకు కీలక పాత్రలు ఇస్తుంటారు. అలా అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబులు ముఖ్యపాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే.