ఫిదా మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సాయి పల్లవి. మొదటి మూవీతోనే అందర్నీ ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్గా మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంది. సాయి పల్లవి స్కిన్ షో కి నో అని చెప్తూ నటనకి ప్రాధాన్యతీస్తూ అటువంటి పాత్రలని ఎంచుకుంటూ ఉంటుంది. సాయి పల్లవి చాలా రోజులుగా వరుస మూవీ లతో బిజీగా ఉంటోంది. సాయి పల్లవి నటన ఒక ఎత్తు అయితే డాన్స్ ఒక ఎత్తు. డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
సిల్వర్ స్క్రీన్ మీద ఆమె వేసే స్టెప్పులు వేరే లెవెల్ లో ఉంటాయి. లేడీ ప్రభుదేవా అనే పేరు ను కూడా దక్కించుకుని తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన తండ్రి పై కామెంట్స్ చేసింది. మూవీ సెట్స్ లో డాన్స్ వేసి ఇంటికి వెళ్తే చాలా టైడ్ గా అనిపించేది. నాన్న అది గమనించి నాకు వచ్చి కాళ్లు పట్టే వారు వద్దన్నా వినేవారు కాదు చక్కగా మసాజ్ చేసేవారు అని అంటూ సాయి పల్లవి కామెంట్స్ చేసింది.