బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. సాగర్ రింగ్‌రోడ్ చౌరస్తాలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ప్లైఓవర్ లూప్‌ను గురువారం జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సుజాతానాయక్‌తో కలిసి మధుయాష్కీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం, పది రోజుల్లో ప్లైఓవర్ పనులు పూర్తవుతాయని, వాహనదారులకు అందుబాటులోకి వస్తుందన్నారు.


