ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 27న బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) నిర్వహించబోయే రజతోత్సవ సభ సక్సెస్ కాబోతోందని..కేసీఆర్‌ను చూసేందుకు జనాలు ఆశగా ఉన్నారని.. కేసీఆర్‌ సభకు భారీగా జనం రావొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అదే కాకుండా ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కూ ఆయన మద్దతు పలికారు. కంచ గచ్చిబౌలి విషయంలో స్మితా సభర్వాల్ చేసిన పోస్టులో తేడా ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె పోస్టు చేయలేదని చెప్పుకొచ్చారు.