ట్రయాంగిల్‌ పోరు తప్పేలా లేదు…!

sepember13th Three Movies Released

సెప్టెంబర్‌ 13న వినాయక చవితి సందర్బంగా అక్కినేని నాగచైతన్య నటించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యూటర్న్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ భార్య భర్తలు ఒకే రోజు రావడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఈ ఇద్దరు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. అయితే అదే రోజున సుధీర్‌బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమ్మోహనం చిత్రం సక్సెస్‌ తర్వాత సుధీర్‌బాబు ఈ చిత్రంను చేయడం జరిగింది. సుధీర్‌బాబు సొంతంగా ఈ చిత్రంను నిర్మించడంతో అంచనాలున్నాయి.

samantha-sudeer

 

భారీ అంచనాల నడుమ రూపొందిన శైలజ రెడ్డి అల్లుడు మొదట ఆగస్టు 31న విడుదల చేయాలని భావించినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సెప్టెంబర్‌ 13కు విడుదల వాయిదా వేయడం జరిగింది. ఇక యూటర్న్‌ను వాయిదా వేయించాలని ప్రయత్నించిన శైలజ రెడ్డి అల్లుడు నిర్మాతలు విఫలం అయ్యారు. ఇదే సమయంలో సుధీర్‌బాబును కూడా ఒప్పించేందుకు చైతూ మూవీ నిర్మాతలు విఫల ప్రయత్నం చేశారు. దాంతో మూడు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వక తప్పని పరిస్థితి. సుధీర్‌బాబు తన చిత్రాన్ని వారం పాటు వాయిదా వేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాని ఆయన మాత్రం ముందు నుండి చెబుతూ, ప్రచారం చేశాం కనుక విడుదల చేయలేం అంటున్నాడు. దాంతో సెప్టెంబర్‌ 13న ట్రయాంగిల్‌ పోరు తప్పేలా లేదు.

SAMANTHA1