సీరియల్‌ నటి లహరి కారు ప్రమాదం

సీరియల్‌ నటి లహరి కారు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ సీరియల్‌ నటి లహరి కారు, బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లహరి కారు డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్నట్లు తెలిసింది.

ఘటన జరిగిన తరువాత లహరి కారు నుంచి బయటకు దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుని.. కార్‌తో పాటు లహరిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లహరి మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయనున్నారు.