మరో సారి ఏపీకి హ్యాండ్ ఇచ్చిన కేంద్రం…!

Seven Backward Districts Rs 350 Crore Not Release From Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం గత ఆరు నెలలుగా నిధులు విడుదల చేయలేదు. తెలంగాణలోని 9,ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాలకు వెనుకబడిన జిల్లాల కింద నిధులు రావాలి. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రావాల్సి ఉంది. ఆరు నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలకు నిధులు రావాల్సి ఉంది. కానీ రాలేదు. ఇందులో భాగంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున నిధులు సాధారణ పద్ధతిలోనే రాష్ట్రాల ఖాతాల్లో జమ అవుతుంటాయి. ఇదేమీ ప్రత్యేక వెసులుబాటు కాదు. ఆ నిధులకు రాష్ట్రాలు యూసీలు పంపిస్తే.. కేంద్రం తదుపరి నిధులు విడుదల చేస్తుంది. మన రాష్ట్రానికీ గత ఏడాది నిధులు విడుదలయ్యాయి. వాటిని ఖర్చు పెట్టి సంబంధిత యూసీలను కేంద్రానికి పంపింది కూడా. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిన రాష్ట్ర ఖాతాలో కేంద్రం నుంచి రూ.350 కోట్లు జమ అయ్యాయి.

ANDHRAPRADESH-TELENGANA

అప్పటికే కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టడం.. ఇందులో ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, రాష్ట్ర ప్రజలు నిరసనలకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. నిధులు, యూసీల అంశంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఖాతాలో రూ. 350 కోట్లు జమయ్యాయి. కానీ ఆ వెంటనే ఫిబ్రవరి 15వ తేదీన కేంద్రం ఆ నిధులను వెనక్కి లాగేసుకుంది. అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు,ఖర్చుల వివరాలు అందించని కారణంగా వీటిని వెనక్కి తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యూసీలు,ఖర్చుల వివరాలు పంపించింది. యూసీలు, ఖర్చులు సమర్పించి నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాలేదు. ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదని చెప్పారు. ఏపీ యూసీలు ఆలస్యంగా ఇచ్చినందువల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనుకబడిన జిల్లాలకు గాను ఏటా తెలంగాణకు రూ.450 కోట్లు,ఏపీకి రూ.350 కోట్లు చెల్లిస్తోన్న కేంద్రం నుంచి ఈ ఏడాదికి గాను ఏపీకి మాత్రం రావాల్సి ఉంది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలోని పాత తొమ్మిది జిల్లాలకు నిధులు వస్తున్నాయి.

cm-kcr-meet