న్యూయార్క్‌ నగరం కాల్పులు

న్యూయార్క్‌ నగరం కాల్పులు

అమెరికాలో న్యూయార్క్‌ నగరం కాల్పులతో ఉలిక్కి పడింది. బ్రూక్లిన్‌ సబ్‌ వే స్టేసన్‌ వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురి ప్రయాణికులపై ముసుగులో వచ్చిన ఆంగతకుడు విచ్చగల విడిగా కాల్పులు జరిపాడు. అంతకు ముందు స్మోకింగ్‌ గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ దాడిలో 13 మంది గాయపడినట్లు సమాచారం. ఎవరైనా చనిపోయారా? అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

బ్రూక్లిన్‌లోని సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అయితే.. రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు కూడా సంభవించినట్లు కథనాలు వస్తున్నాయి. ఘటనలో ఆరుగురు మరణించారని, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కథనాలను అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. అలాగే పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పలేదు. కానీ, న్యూయార్క్‌లో హైఅలర్ట్‌ మాత్రం ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. బ్రూక్లిన్‌ ఫోర్త్‌ ఎవెన్యూ 36వ స్ట్రీట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్‌వే నుంచి భారీగా పొగలు వస్తుండడం, సహాయక చర్యల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రదాడేనా? కాదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్‌వై 1 న్యూస్‌ మాత్రం.. అనుమానితుడు కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌ ముసుగులో గ్యాస్‌ మాస్క్‌తో దాడికి పాల్పడినట్లు కథనం ప్రచురించింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో రక్తపు మడుగులో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.