షారుక్ ఖాన్ ఇక స్పీడ్ పెంచనున్నారు. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత ఆయన వెండితెరపై కనిపించలేదు. ‘జీరో’ ఆశించినంత సక్సెస్‌ను ఇవ్వలేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న షారుక్ ఆ తర్వాత ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్, అట్లీ దర్శకత్వాల్లో సినిమాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి షూటింగ్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాల షూటింగ్స్ స్పీడ్‌గా జరుగుతున్న టైమ్‌లో తనయుడు అర్యన్‌ఖాన్ ఓ కేసులో అరెస్ట్ కావడంతో షారుక్ ఖాన్ ఆ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఆయన చేస్తున్న సినిమాలకు స్పీడ్ బ్రేకర్స్ పడ్డాయి.
ఇటీవల ఆర్యన్‌ఖాన్ విడుదల కావడంతో తన సినిమాలపై షారుక్ మళ్లీ ఫోకస్ పెట్టారని బాలీవుడ్ సమాచారం. తన సినిమాల్లోని గెటప్స్‌కు తగ్గట్లుగా ఫిజిక్‌ను చేంజ్ చేసేందుకు జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారట ఆయన. ముందుగా ‘పఠాన్’ చిత్రాన్ని, ఆ తర్వాత అట్లీ సినిమాను పూర్తి చేసేసి, ఆ నెక్ట్స్ రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించే సినిమాకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. ‘పఠాన్’ షూటింగ్ తిరిగి ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్.